ప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణ..! 11 h ago
TG : ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో విచారణ కొనసాగుతుంది. విచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావును అధికారులు లోపలికి అనుమతించారు. అరవింద్ కుమార్‌తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలు మోపారు. కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నిస్తున్నారు.